డీజీపీ రెండుసార్లు హైకోర్టు గడప తొక్కారంటేనే రాష్ట్రంలో శాంత్రిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతోందని నారా లోకేశ్ పేర్కొన్నారు. దాడులను ప్రోత్సహించేవారిపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని... లేనిపక్షంలో తామే ఆ సంఘం నేతలతో కలిసి న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: లోకేశ్ - నారా లోకేశ్
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వర్ణకారుల సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు.
నారా లోకేశ్