Nara Lokesh on Margadarsi: కోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మార్గదర్శిపై ప్రభుత్వం చేస్తున్న చర్యలపై ప్రతి ఒక్కరి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరాధార ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వ చర్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకపోవడం ఏంటని మండిపడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఈనాడులో బయటపెడుతూ వార్తలు రాస్తున్నారనే జగన్ మార్గదర్శిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఈనాడు యజమాని, మార్గదర్శి యజమాని ఒక్కరే కావటంతో 60 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థపైన ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు.
మార్గదర్శిపై దాడులతో ఈనాడును భయపెట్టాలని చూడటం సైకో చర్యలే అని దుయ్యబట్టారు. అందుకే పరిశ్రమలేవీ రాష్ట్రానికి రాకుండా, ఉన్నవి కూడా తరలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త వేసిన చానల్స్ పైనా దాడి చేస్తున్నారని విమర్శించారు.
Nara Lokesh Fire on CM Jagan About Margadarsi: ''మార్గదర్శిపై దాడులతో భయపెట్టాలని చూడటం.. సైకో చర్యలే '' "ఎవరైనా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, పోస్టులు చేసినా, వార్తలు రాసినా.. వారందరిపై దాడులు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మార్గదర్శిపై దాడులు చేస్తున్నారు. ఆ సంస్థ స్థాపించి 60 ఏళ్లు దాటింది. ఏ ఒక్క డిపాజిటర్ కంప్లైంట్ చేయలేదు." -నారా లోకేశ్
Margadarsi: మార్గదర్శిపై ప్రతీకారాత్మక దాడి.. ఏపీ సీఐడీ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించిన సంస్థ
CPI Rally Government Actions Against on Margadarsi: ముఖ్యమంత్రి జగన్ కక్షపూరితంగానే మార్గదర్శిపై సీఐడీ దాడులు నిర్వహిస్తున్నారని సీపీఐ అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్ అన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత చూసి ఓర్వలేక జగన్ మీడియా సంస్థలపై దాడులు చేయిస్తున్నారని సీపీఐ నాయకులు మండిపడ్డారు. మార్గదర్శిపై సీఐడీ దాడులకు వ్యతిరేకంగా అనంతపురంలోని సీపీఐ కార్యాలయం నుంచి పాతూరు గాంధీ విగ్రహం వరకు సీపీఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు.
గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కోల్పోతూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు. మార్గదర్శిపైన హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కోర్టును సైతం లెక్కచేయకుండా దాడులు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ న్యాయస్థానానికి విలువ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ కక్షపూరిత వ్యవహారాలను ఉపసంహరించుకోవాలని కోరారు.
"మార్గదర్శిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. పోలీసులు నిన్నటి నుంచి సోదాలు చేయటం... వారి సిబ్బందిని కార్యాలయాల నుంచి బలవంతంగా బయటికి గెంటివేయటం, కార్యాలయాలకు తాళలు వేయటం.. ఈ రకమైన చర్యలు చేపట్టటం సరైంది. ఇది అప్రజాస్వామికం." - జాఫర్, సీపీఐ నేత
CPI Ramakrishna Response on Margadarsi: మార్గదర్శి వ్యవహారంలో హైకోర్టు స్టే ప్రభుత్వానికి చెంపపెట్టు: రామకృష్ణ
Bonda Uma On Margadarsi: మార్గదర్శిని ఏమీ చేయలేరు: జగన్ రెడ్డి వ్యక్తిగత కక్ష కోసం సీఐడీ పోలీసులతో మార్గదర్శిపై దాడులు చేయిస్తున్నాడని.. దీనినే ప్రజలు సైకో పాలన అంటారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా మండిపడ్డారు. కోర్టు స్పష్టంగా ఆదేశించినా లెక్కలేని తనంగా మార్గదర్శిని ఇబ్బంది పెడుతున్నాడని ధ్వజమెత్తారు. లేని అధికారంతో నిత్యం దాడులు చేయిస్తున్నాడని.. ఇన్ని దాడులు చేసినా మార్గదర్శిలో ఏ తప్పు పట్టుకోలేకపోయాడని దుయ్యబట్టారు.
లక్షల మంది చందాదారులు ఉన్న మార్గదర్శిపై ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని గుర్తుచేశారు. ఫిర్యాదు లేకుండా దేశంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న మొదటి కేసు మార్గదర్శిపైనే అని.. ఇది జగన్ రెడ్డి రికార్డని ఎద్దేవా చేశారు. ఎన్ని తప్పుడు విచారణలు చేసినా చట్టబద్ధంగా నడుపుతున్న మార్గదర్శిని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
AP Government Once Again Actions on Margadarsi: మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపు చర్యలు.. కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా