ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ అమరావతి సై అని... ముఖ్యమంత్రి అయ్యాక నై అంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జగన్ రెడ్డి మడమ తిప్పి మాట మార్చారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అమరావతిపై వివిధ సందర్భాల్లో జగన్తో పాటు ఇతర వైకాపా నేతలు మాట్లాడిన వీడియోను ఆయన ట్విటర్లో విడుదల చేశారు.
నాడు అమరావతికి జై... నేడు నై: లోకేశ్ - అమరావతి రాజధాని వార్తలు
ముఖ్యమంత్రి జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి మద్దతు తెలిపి... అధికారంలోకి వచ్చాక వద్దు అంటున్నారని విమర్శించారు.
nara lokesh criticized cm jagan