రేపో మాపో జైలుకు వెళ్లే జగన్ రెడ్డిని చూసుకుని రెచ్చిపోతున్న ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుండిపోయే శిక్ష అనుభవిస్తారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh)హెచ్చరించారు. జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మూకలు రెచ్చిపోతున్నా... పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా కొప్పర్రులో తెదేపా నాయకురాలు శారద ఇంటిపై వైకాపా గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు. శారద కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ దాడిలో ఒక ఎస్సైకి కూడా గాయాలు అయ్యాయని పోలీసు సంఘం వారు యథావిధిగా వైకాపా మసాజ్ అంటారా అని ట్వీట్ చేశారు. దాడి ఘటనకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాకు జత చేశారు
nara lokesh: 'దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి' - Kopparru latest news
గుంటూరు జిల్లా కొప్పర్రులో తెదేపా నాయకురాలు శారద ఇంటిపై వైకాపా గూండాల దాడిని నారా లోకేశ్(nara lokesh) ఖండించారు. శారద కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపో మాపో జైలుకు వెళ్లే జగన్ రెడ్డిని చూసుకుని రెచ్చిపోతున్న ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుండిపోయే శిక్ష అనుభవిస్తారని నారా లోకేశ్ హెచ్చరించారు.
nara lokesh