LOKESH ON TEACHERS : ఒక్క ఎన్నికల విధులు మాత్రమే బోధనేతర పనులా అంటూ.. నారా లోకేశ్ ప్రశ్నించారు. ఉపాధ్యాయులను ఎన్నికలు విధుల నుంచి దూరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలాకు, మరుగు దొడ్ల ఫోటోలు తియడానికి, సీఎం టూర్ ఉంటే బస్సులకు కాపలా కాయడానికి పనికొస్తారా అంటూ నిలదీశారు.
ఇదీ జరిగింది:ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకుండా.. విద్యకు సంబంధించిన కార్యకలాపాలకే పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విధుల నుంచి తప్పించింది. విద్యేతర పనులకు ప్రభుత్వశాఖల్లోని సిబ్బంది అందరినీ వినియోగించిన తర్వాత అవసరం ఉందనుకుంటేనే ఉపాధ్యాయులకు విధులను అప్పగించాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది.