Lokesh fire on CM Jagan: ‘అందరికీ ఆరోగ్యమస్తు - ఇంటికి శుభమస్తు’ నినాదంతో సొంత ఖర్చుతో మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య కేంద్రాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ వైద్య కేంద్రం ద్వారా ఆరోగ్య సంజీవని పేరుతో నియోజకవర్గంలోని పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు. ఇందుకు అవసరమైన వైద్యులు, సిబ్బంది, చికిత్స పరికరాలను లోకేశ్ సమకూర్చారు. ఇక్కడ దాదాపు 200కు పైగా రోగనిర్ధరణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌వి పదో తరగతి పాస్.. డిగ్రీ ఫెయిల్ తెలివితేటలని లోకేశ్ ఎద్దేవా చేశారు. వైకాపా హయాంలో రాష్ట్రానికి వచ్చిన వాటి కంటే బయటకు వెళ్లిన పరిశ్రమలే ఎక్కువని ధ్వజమెత్తారు. పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా సీఎంకు వాటా ఎంత అనే చర్చ వస్తుందని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే.. చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈడీ, ఐటీ, సీబీఐకి భయపడి సీఎం జగన్ దిల్లీలో తలవంచారన్నారు. సీఎం జగన్‌కు సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెడతానని లోకేశ్ వెల్లడించారు.