Lokesh built seven roads his own expense: మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలోని పోల్కంపాడు దేవునిమాన్యం ప్రాంతంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన సొంత ఖర్చులతో యుద్ధ ప్రాతిపదికన ఏడు రోడ్లు వేయించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తన తీరు ప్రత్యేకమని మరోసారి చాటారు. ఈ నెల 15వ తేదీన మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవుని మాన్యం ప్రాంత ప్రజలు తమ రోడ్ల దుస్థితిని లోకేశ్‌కు చూపించారు. జంగిల్ క్లియరెన్స్ చేయించి, గుంతలు పూడ్చిన తరువాత.. చిప్స్‌తో ఏడు రోడ్లను సిద్ధం చేయించారు. రాత్రి తమ రోడ్ల ఇబ్బందులు తెలుసుకుని.. 24 గంటల్లోనే ఇళ్లకు వెళ్లేందుకు సాఫీగా రోడ్లను వేయించిన లోకేశ్‌కు స్థానికులు కృతజ్ఞతలు చెప్పారు.
'బాదుడే బాదుడు'లో ప్రజల బాధలు విన్నాడు.. 24 గంటల్లోనే ఏడు రోడ్లు - బాదుడే బాదుడు
Nara Lokesh built seven roads: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 15వ తేదీన మంగళగిరి నియోజకవర్గంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో నిర్వహించారు. ప్రజలు ఆయా ప్రాంతాల రోడ్ల పరిస్థితి తెలపడంతో.. తన సొంత ఖర్చుతో ఏడు రోడ్లు వేయించారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ సమస్యలు చెప్పిన వెంటనే రోడ్లను వేయించిన లోకేశ్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
Etv Bharat