ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు అర్బన్​ ఎస్పీ వైకాపా సోషల్​ మీడియా కోఆర్డినేటరా?: లోకేశ్ - నారా లోకేశ్ తాజా వార్తలు

చట్టపరిధి దాటి ప్రవర్తించొద్దని గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డికి నారా లోకేశ్ సూచించారు. తెదేపా సోషల్ మీడియా కార్యకర్త మణిరత్నం అరెస్టుపై నిన్నొక మాట, ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ లేదా అని లోకేశ్ ప్రశ్నించారు. నిన్నటి నుంచి ఈ ఇద్దరి మధ్య ట్విట్టర్​ వార్​ కొనసాగుతోంది.

nara lokesh
నారా లోకేశ్

By

Published : Nov 26, 2020, 12:41 PM IST

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వైకాపా సోషల్ మీడియా కోఆర్డినేటర్​గా వ్యవహరిస్తున్నారా అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. చట్ట పరిధి దాటి ప్రవర్తించవద్దని సూచిస్తున్నానన్న లోకేశ్.. లేదంటే తీవ్ర ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు. నిన్న తెదేపా కార్యకర్త మణిరత్నం అరెస్టును తప్పుడు వార్తగా ప్రకటించిన ఎస్పీ.. ఈరోజు ప్రశ్నించేందుకు పోలీస్ స్టేషన్​కు పిలిపించామని మాట మార్చారంటూ తప్పుబట్టారు.

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే పౌరులను ప్రశ్నించడానికి మీరెవరంటూ ఎస్పీని లోకేశ్‌ ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించే అధికారం పోలీసులకు ఎక్కడిదని నిలదీశారు. ఫిర్యాదు, కేసు నమోదు లేకుండా పౌరులను ఎలా వేధిస్తారని మండిపడ్డారు. పోలీసుల బాధ్యత ప్రజలకు సేవ చేయడమే కానీ.. రాజకీయ యజమాని కోసం పనిచేయడం కాదని స్పష్టంచేశారు. మణిరత్నాన్ని స్టేషన్​కు పిలిపించి తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించారు. జరిగిన ఘటనపై మణిరత్నం మాట్లాడిన ఓ వీడియోను లోకేశ్ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details