ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనూష కుటుంబాన్ని ఆదుకోవాలి: నన్నపనేని - అనుష మర్డర్ కేసు వార్తలు

తల్లిదండ్రులు ఆడపిల్లలతో పాటుగా మగపిల్లలపై పర్యవేక్షణ చేయాలని.. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్​ పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు. విద్యార్థిని కోట అనూష హత్య దారుణ చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.

nannapaneni rajakumari on anusha murder case
nannapaneni rajakumari on anusha murder case

By

Published : Feb 27, 2021, 5:39 PM IST

విద్యార్థిని అనూష మృతి.. ఆ కుటుంబానికి తీరనిలోటని నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు. అనూష కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. దాతలు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. అనూష కుటుంబసభ్యులకు ప్రభుత్వంతో పాటు కళాశాల యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని రాజకుమారి డిమాండ్ చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేవలం ఉద్యోగస్తులే ఉద్యమాలు చేయడం కాదని, అందరూ పాలుపంచుకోవాలని నన్నపనేని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పై ప్రతీ ఆంధ్రుడు స్పందించాలని ఆమె కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 70 గ్రామాల ప్రజలు తమ భూములు త్యాగం చేశారని.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నన్నపనేని వ్యాఖ్యానించారు.

విద్యార్థిని కుటుంబానికి అండగా ఉండేందుకు అందరూ కృషిచేయగా వైకాపా నాయకులు మాత్రం ఒక్కరుకూడా రాకపోవడం విడ్డూరమని తెదేపా నేత చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తెదేపా నాయకులు ధర్నా చేశారని వైకాపా నేతలు ఆరోపించడం సరికాదన్నారు. విద్యార్థిని హత్యపై స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి కనీసం స్పందించకపోవడం దారుణమని ఆరోపించారు. తెదేపా నాయకులపై వైకాపా నాయకులు విమర్శలు చేస్తే సహించేది లేదని చదలవాడ హెచ్చరించారు.

ఇదీ చదవండి:రూ.2,937 కోట్లతో తితిదే వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం

ABOUT THE AUTHOR

...view details