ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారా లోకేశ్​తో నందమూరి తారకరత్న భేటీ.. అందుకోసమేనా..?

Tarakaratna Nara Lokesh meet: హైదరాబాద్​లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​తో నందమూరి తారకరత్న భేటీ అయ్యారు. ఈ నెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర చేస్తున్నందున తారకరత్న మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు కాసేపు చర్చించారు.

Nandamuri Tarakaratna
నారా లోకేశ్​తో నందమూరి తారకరత్న

By

Published : Jan 10, 2023, 5:03 PM IST

Nara Lokesh and Nandamuri Tarakaratna Meet: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​తో హైదరాబాద్​లో నందమూరి తారకరత్న భేటీ అయ్యారు. ఈ నెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర చేస్తున్నందున తారకరత్న మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు కాసేపు చర్చించారు. గత కొంత కాలంగా తారకరత్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడతారన్న వార్తల నేపథ్యంలో వీరి భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఇప్పటికే రాష్ట్రంలో జీవో నెంబర్ 1 అమలు ఉన్న నేపథ్యంలో ఈ నెల 27న లోకేశ్ పాదయాత్ర మీద.. ప్రభుత్వం చేపట్టబోయే చర్యలపై ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు సభలు, రోడ్డు షోలకు వైసీపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షపార్టీలపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చంద్రబాబును జనసేన అధినేత పవన్ కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై చర్చించారు. తాజాగా నందమూరి తారకరత్న నారా లోకేశ్​తో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details