ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల అభ్యున్నతికి జీవితం త్యాగం చేసిన మహనీయుడు ఎన్టీఆర్​: నందమూరి రామకృష్ణ - సినీ నటుడు నారా రోహిత్‌

NANDAMURI RAMKRISHNA ON NTR AS CM : పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నతుడు ఎన్టీఆర్​ అని ఆయన తనయుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని చంద్రబాబు పునికి పుచ్చుకున్నారని అభినందించారు. ఎన్నికల్లో అద్భుత, అఖండ విజయాలు సాధించి ఎన్టీఆర్​ ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు.

Nandamuri Ramakrishna
Nandamuri Ramakrishna

By

Published : Jan 9, 2023, 4:28 PM IST

Nandamuri Ramakrishna : పేదల కోసం జీవితం త్యాగం చేసిన మహనీయుడు ఎన్టీఆర్​ అని.. అతని తనయుడు నందమూరి రామకృష్ణ కొనియాడారు. 36 సంవత్సరాల అవినీతి కాంగ్రెస్​ను ఎన్టీఆర్​ రాకతో 10 కోట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరమ గీతం పాడారన్నారు. ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని చంద్రబాబు పునికి పుచ్చుకున్నారని అభినందించారు.

ఎన్టీఆర్​ చూపిన బాటలోనే నడుస్తూ టీడీపీని, తెలుగుజాతిని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. అలాంటి నాయకునికి ప్రజలు, కార్యకర్తలు వెన్నుదన్నుగా నిలవాలని సూచించారు. తెలుగుజాతిని, తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి , తెలుగుజాతి అభివృద్ధికి బాటలు వెయ్యాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో అద్భుత, అఖండ విజయాలు సాధించి ఎన్టీఆర్​ ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు.

NARA LOKESH : తెలుగు జాతి ఆత్మ‌గౌర‌వ ప‌తాకాన్ని.. స‌గ‌ర్వంగా ఎగుర‌ వేసిన రోజు తెలుగుదేశానికి ప‌ర్వ‌దినం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. అణ‌గారిన‌ వ‌ర్గాల అభ్యున్న‌తి, తెలుగుజాతి ఆత్మాభిమానం ప‌రిర‌క్ష‌ణ ల‌క్ష్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెల‌ల్లోనే అధికారంలోకి తెచ్చిన మ‌హానాయ‌కుడు ఎన్టీఆర్​ అని కొనియాడారు.

NARA ROHIT : జనవరి 9న తెలుగు ప్రజల కీర్తి పతాకం ఎగిరిన రోజు అని సినీ నటుడు నారా రోహిత్‌ తెలిపారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని చాటిచెప్పిన రోజని కొనియాడారు. ఎన్టీఆర్‌ సీఎంగా తొలి ప్రమాణ స్వీకారానికి నేటికి 40 ఏళ్లు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details