ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాపేరును తప్పుగా ముద్రించారు.. మళ్లీ ఎన్నికలు జరపండి' - AP Parishat Election news

కొల్లూరు మండలానికి చెందిన నాగమల్లేశ్వరరావు... సీపీఎం తరఫున జడ్పీటీసీగా పోటీచేశారు. బ్యాలెట్ పేపర్​లో తన పేరును తప్పుగా ముద్రించారని ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. బ్యాలెట్ పేపర్లో నాగమల్లేశ్వరరావు బదులు నాగేశ్వరరావు అని ముద్రించగా... తన మద్దతుదారులు, అభిమానులు ఓటు వేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

నాగమల్లేశ్వరరావు
నాగమల్లేశ్వరరావు

By

Published : Apr 10, 2021, 10:23 AM IST

తన పేరును బ్యాలెట్ పేపర్​లో తప్పుగా ముద్రించారని ఎన్నికల కమిషన్​కు... సీపీఎం జడ్పీటీసీ అభ్యర్థి పంతగాని నాగమల్లేశ్వరరావు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలానికి చెందిన నాగమల్లేశ్వరరావు... సీపీఎం తరుఫున పోటీ చేశారు. ఓటింగ్ రోజున ఉదయం ఏడున్నర గంటలకు పోలింగ్ కేంద్రానికి వెళ్లగా... అక్కడ బ్యాలెట్ పేపర్​లో తనపేరు తప్పుగా ఉందని గుర్తించారు.

విషయంపై పోలింగ్ కేంద్రంలోని అధికారుల్ని అడగ్గా... తమకు తెలియదని సమాచారం ఇచ్చారు. రిటర్నింగ్ అధికారికి చెబుదామని వెళితే స్పందించలేదన్నారు. బ్యాలెట్ పేపర్లో నాగమల్లేశ్వరరావు బదులు నాగేశ్వరరావు అని ముద్రించగా... తన మద్దతుదారులు, అభిమానులు ఓటు వేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిపి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details