ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓబులనాయుడుపాలెంలో వివాహిత హత్య కేసును చేధించిన పోలీసులు

గుంటూరు శివారు ఓబులనాయుడు పాలెంలో వివాహిత హత్య కేసును నల్లపాడు పోలీసులు చేధించారు. పది మందిని అదుపులోకి తీసుకున్నారు.

హత్య కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ
హత్య కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ

By

Published : Dec 4, 2020, 7:08 AM IST

గుంటూరు నగర శివారు ఓబులనాయుడుపాలెంలో గత నెల 30న జరిగిన వివాహిత హత్య కేసును నల్లపాడు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని... మరో ఇద్దరు పరారీలో ఉన్నారని సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు. నిందితుల నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఆస్తి కోసమే కుటుంబసభ్యులు ఏమినేడి రాణి శ్రీ ( 48 ) ని పథకం ప్రకారం హత్య చేసినట్లు వివరించారు.

"ఈనెల 1వ తేదీన బొడ్డు దుర్గమ్మ అనే మహిళ తన కూతురు రాణీశ్రీని ఎవరో హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాణి శ్రీ 15 సంవత్సరాల క్రితం తన భర్త నుంచి విడిపోయి.. గుంటూరు ఓబులునాయుడు పాలెంకు చెందిన ఏమినేడి చెన్నయ్య గౌడ్​తో సహజీవనం చేసింది. ఈ క్రమంలో 2018 లో వారికి ఒక బాబు జన్మించాడు. చెన్నయ్య గౌడ్ వడ్డీ వ్యాపారం చేస్తూ బాగా సంపాందించాడు. అతనికి వయసు మీద పడతంతో... రాణి శ్రీ, పుట్టిన బాబు పేరు మీద ఆస్తులు రాశాడు. ఎలాగైనా చెన్నయ్య ఆస్తిని కాజేయాలని... అన్నదమ్ముల పిల్లలు పన్నాగం పన్నారు. ఆస్తిలో కొంత భాగం తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే.. ఏమినేడి చెన్నయ్య గౌడ్ కరోనా సోకి మృతి చెందాడు. రాణిశ్రీ నుంచి ఆస్తిని దక్కించుకునేందుకు పథకం ప్రకారం చెన్నయ్య అన్న పిల్లలు ఆమెను కత్తితో పొడిచి చంపేశారు" అని గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీ వై.జెస్సి ప్రశాంతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details