గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వేమూరు నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్లను మంత్రి నక్కా ఆనందబాబు పరిశీలించారు. వ్యవస్థలపై నమ్మకం పోయేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తాము చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా.. వైకాపా చేసిన ఫిర్యాదులపై ఈసీ తక్షణమే స్పందిస్తుందని తెలిపారు. అర్ధరాత్రి వేళలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పని చేయకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా విజయం తమదేనన్నారు.
ఈసీపై నమ్మకం పోతుంది: మంత్రి ఆనందబాబు
వ్యవస్థలపై నమ్మకం పోయేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. అర్ధరాత్రి వేళలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పని చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్ట్రాంగ్ రూమ్లను పరిశీలిస్తున్న మంత్రి నక్కా ఆనందబాబు