ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపాను రాజకీయంగా దెబ్బతీసేందుకే కేంద్రం దాడులు' - guntur

ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకొని తెదేపా అభ్యర్థులపై కక్షపూరితంగా  ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని వేమూరు తెదేపా అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు అన్నారు.

'తెదేపాను రాజకీయంగా దెబ్బతీసేందుకే కేంద్రం దాడులు'

By

Published : Apr 6, 2019, 4:21 PM IST

ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకొని తెదేపా అభ్యర్థులపై కక్షపూరితంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని వేమూరు తెదేపా అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా అమృతలూరు మండలం గోవాడలో రోడ్​షో చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి... సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మద్దతుగా వేల సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. తెదేపాను రాజకీయంగా దెబ్బతీసేందుకే రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల బదీలీ జరుగుతోందని ఆనంద్​బాబు విమర్శించారు. వైకాపాకు లబ్ధి చేసేందుకే ప్రధాని మోదీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా దీనిని గమనిస్తున్నారని... ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు.

'తెదేపాను రాజకీయంగా దెబ్బతీసేందుకే కేంద్రం దాడులు'

ABOUT THE AUTHOR

...view details