ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సీ ప్రతిఘటన ర్యాలీకి వెళ్లకుండా నక్కా ఆనందబాబును అడ్డుకున్న పోలీసులు - నక్కా ఆనందబాబు తాజా వార్తలు

ఎస్సీ ప్రతిఘటన ర్యాలీకి వెళ్లకుండా తెదేపా నేత నక్కా ఆనందబాబును గుంటూరులో పోలీసులు అడ్డుకున్నారు. ఎవరి హయాంలో ఎస్సీల అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా? అంటూ ఆనందబాబు సవాల్ విసిరారు.

Nakka Anandbabu
Nakka Anandbabu

By

Published : Aug 10, 2021, 11:57 AM IST

రాష్ట్రంలో ఎవరి హయాంలో దళితుల అభివృద్ధి జరిగిందో.. చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి నక్కా ఆనంద్​బాబు సవాల్ విసిరారు. విజయవాడలో తెదేపా తలపెట్టిన దళిత ప్రతిఘటన ర్యాలీ బయలుదేరిన ఆనంద్‌బాబును.. గుంటూరులోని నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి పోలీసులు అనుమతివ్వకపోవడం అప్రజాస్వామికమని నక్కా ఆనందబాబు అన్నారు. రెండేళ్ల వైకాపా పాలనలో ఎస్సీలపైనే ఎక్కువగా దాడులు జరిగాయన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారిమళ్లిస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details