ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nakka anandbabu: కరోనా మరణాల్లో ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు: నక్కా ఆనంద్‌బాబు - వైకాపాపై మండిపడ్డ నక్కా ఆనంద్ బాబు

కరోనా తీవ్రతను మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని.. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. కొవిడ్ మరణాల్లో.. ప్రభుత్వ లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదన్నారు.

nakka anandbabu fires on ycp over corona deaths
కరోనా మరణాల్లో ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు: నక్కా ఆనంద్‌బాబు

By

Published : Jun 15, 2021, 3:36 PM IST


కరోనా తీవ్రతను మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని.. పక్కదారి పట్టిస్తూ వచ్చిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. కొవిడ్ మరణాల్లో.. ప్రభుత్వ లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదన్నారు. మే నెలలో లక్ష 30వేల మందికిపైగా చనిపోయినట్టు మరణ ధ్రువీకరణ గణంకాలు చెప్తుంటే.. అందులో 10శాతమైనా అధికారికంగా ప్రకటించలేదన్నారు. గ్రామాల వారీగా లెక్కలు తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details