రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం మళ్లీ రావాల్సిన అవసరం ఉందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం చిలుమూరులో ఎన్నికల ప్రచారం చేశారు. కోలహలంగా సాగిన ప్రచారంలో పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న కుట్రలకు రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. వైకాపా, భాజపా, తెరాస నాయకులులాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రంపై కక్షగట్టారని, న్యాయంగా ఏపీకి రావల్సిన నీటి వాటాను అడ్డుకుంటున్నారని తెలిపారు.వైఎస్ వివేకా మరణంపై స్పందించిన మంత్రి.. ప్రతిపక్షనేత జగన్ మరో కొత్త నాటకానికి తెర తీశారనిఆరోపించారు. హత్యారాజకీయాలు జగన్కు కొత్తమే కాదన్నారు. రాజకీయలబ్ధి కోసం సొంత చిన్నాన్న మరణాన్ని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు.