వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దమనకాండ ఆగడం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎస్సీ శ్మశానవాటికలో సమాధులు కూల్చిన ఘటనస్థలిని ఆనందబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిజ నిర్ధరణ కమిటీ పరిశీలన చేసింది.
వైకాపా ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి ఇలాంటి సంఘటన చేసేది వాళ్లేనని.. మళ్లీ సమర్ధించుకునేదీ వారేనని ఎద్దేవా చేశారు. సమాధులు కూల్చటం అనాగరిక చర్య అని విమర్శించారు. ఇది కావాలనే చేసినట్టు కనిపిస్తోందన్నారు. ప్రభుత్వమే సమాధానం చెప్పాలని.. ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.