అచ్చెన్నాయుడి అరెస్టుపై తెదేపా నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం చేసే దోపిడీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. ఏసీబీ ద్వారా ఒక కేసు సృష్టించి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ హేయమైన చర్యగా అభిప్రాయపడ్డారు. ఎర్రన్నాయుడు కుటుంబాన్ని మట్టుబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలాగా గతంలో ఎవరూ కోర్టుల చేత ఇన్ని మొట్టికాయలు తినలేదన్నారు. నిన్నటివరకు దళితులపై.. నేడు బీసీలపై దాడులు ప్రారంభించారని మండిపడ్డారు. వైకాపా దుర్మార్గపు పాలనకు అచ్చెన్నాయుడు అరెస్ట్ పరాకాష్ఠ అని విమర్శించారు. ప్రజలందరూ వైకాపా పాలనపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
'వైకాపా పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి' - అచ్చెన్నాయుడు అరెస్ట్ తాజా వార్తలు
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుపై తెదేపా నేతలు ధ్వజమెత్తారు. అన్యాయంగా ఒక బీసీ నాయకుడిని అరెస్ట్ చేయించారని విమర్శించారు. త్వరలో ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తారనే భయంతోనే.. అచ్చెన్నను అరెస్ట్ చేశారని.. నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా దుయ్యబట్టారు.
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతల విమర్శలు