ఇసుక కొరత కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 8 మంది భవన నిర్మాణ కార్మికులు... మృతిచెందారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చేబ్రోలు మండలం వేజెండ్లలో ఇటీవల మృతిచెందిన నాగూర్వలీ కుటుంబాన్ని ఎమ్మెల్యే గిరితో కలసి ఆయ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ... కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. కార్మికులు ఇంత ఇబ్బందులు పడుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వైకాపా నాయకులు మాత్రం ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు.
'భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు బాధాకరం'
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్లలో... ఇటీవల మృతిచెందిన భవన నిర్మాణ కార్మికుడు నాగూర్వలీ కుటుంబాన్ని మాజీమంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే మద్దాలి గిరి పరామర్శించారు.
నక్కా ఆనందబాబు
ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ... 5 నెలలుగా ఇసుక లేక కార్మికులు అవస్థలు పడుతుంటే... ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా స్పందించి ఇసుక సరఫరా చేయాలని కోరారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి.. ఆగని బలిదానాలు.. గుంటూరు జిల్లాలోనే ఇద్దరు!