పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు నిరసనగా.. గుంటూరులో అమరావతి పరిరక్షణ ఐకాస నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్‌ను పాటిస్తున్నారు. నగర వ్యాప్తంగా వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు మూసివేశారు. ఐకాస నాయకులు నగరంలోని జిన్నా సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. స్వార్ధ ప్రయెజనాల కోసం రాజధానిని ముక్కలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటించేవరకు ఐకాస ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతాయని వెల్లడించారు.
'స్వార్ధ ప్రయోజనాల కోసం రాజధానిని ముక్కలు చేస్తే ఊరుకోం'
రాష్ట్ర ప్రభుత్వం మందీ మార్బలంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుకు నిరసనగా ఐకాస నాయకులు గుంటూరులో బంద్ నిర్వహించారు.
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు