పోలీసుల తీరుపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు ఇంటిపై దాడి జరగలేదనేలా చిత్రీకరణకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసు, ఐపీఎస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా పని చేస్తున్నారని ఆనంద్ బాబు ఆరోపించారు. డీజీపీ కార్యాలయం వద్ద విధులకు ఆటంకం కలిగించామని కేసు పెట్టారు..మమ్మల్ని అడ్డుకుంది ఏఎస్ఐ కాదు, ఎస్పీ అమ్మిరెడ్డి అని నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. పోలీసు స్టేషన్లను వైకాపా కార్యాలయాలుగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు గోడు చెప్పుకొనే అవకాశం లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని గుంటూరులో విమర్శించారు.
Nakka Anandbabu: 'పోలీస్స్టేషన్లను వైకాపా కార్యాలయాలుగా మారుస్తున్నారు' - గుంటూరులో అమ్మిరెడ్డి వ్యాఖ్యలు
పోలీసుల తీరుపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. పోలీసు స్టేషన్లను వైకాపా కార్యాలయాలుగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నక్కా ఆనంద్ బాబు