ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ నమ్మకద్రోహానికి హద్దులు లేవు - విశ్వసనీయతకు అర్థం తెలియని వ్యక్తి : నక్కా ఆనంద్ బాబు

Nakka Anand Babu Fired on AP CM Jagan: సీఎం జగన్ తనను నమ్మిన వాళ్లను నట్టేట ముంచే రకమని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. తనను నమ్మి, తన కోసం పని చేసిన సొంత తల్లికి, చెల్లికి ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. జగన్ ను నమ్ముకొని అమరావతి కేసుల్లో ఇరుక్కొని జగన్ ప్రాపకం కోసం వెంపర్లాడిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని సైతం జగన్ తరిమేశారని నక్కా పేర్కొన్నారు.

Nakka Anand Babu Fired on AP CM Jagan
Nakka Anand Babu Fired on AP CM Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 5:39 PM IST

Nakka Anand Babu Fired on AP CM Jagan: జగన్ నమ్మకద్రోహానికి హద్దులు లేవని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. జగన్ కు విశ్వసనీయతకు అర్థం తెలియదని మండిపడ్డారు. జగన్ సమావేశాలంటేనే జనం బెంబేలెత్తుతూ, ఛీత్కరించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎత్తుకొని పెంచిన చిన్నాన్న పట్ల జగన్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందేనని ఆక్షేపించారు. శంఖుస్థాపన చేసిన కడప స్టీల్ ఫ్యాక్టరీ పునాదిరాయికే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత తల్లికి, చెల్లికి ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. కేవీపీ రామచంద్ర, సూరీడు తదితరులు కనుమరుగుకు జగన్ కారణమని ఆరోపించారు. జగన్ ను నమ్ముకొని ఐదారు అమరావతి కేసుల్లో ఇరుక్కొని జగన్ ప్రాపకం కోసం వెంపర్లాడిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తరిమేశారని గుర్తుచేశారు. గతంలో వైసీపీ నేతలే ప్రశాంత్ కిశోర్ ఎటువైపు వెళ్తే అటువైపు గెలుస్తారని అన్నారని, తాజాగా సీఎం జగన్​ను గెలవడని తెలిసే ప్రశాంత్ కిశోర్​ టీడీపీ వైపు వచ్చారని నక్కా పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు.

జగన్ నమ్మకద్రోహానికి హద్దులు లేవు - విశ్వసనీయతకు అర్థం తెలియని వ్యక్తి : నక్కా ఆనంద్ బాబు

వైఎస్సార్సీపీ సిట్టింగ్​ ఎమ్మెల్యేలలో సీటు భయం - సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రులు, ఎమ్మెల్యేల క్యూ

జగన్ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు అన్యాయం: జగన్​ను నమ్మివెంట వచ్చిన వారిని బలిపెట్టే స్వభావం అని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. విశ్వసనీయత అని మాట్లాడే జగన్​కు ఏమాత్రం విశ్వసనీయత లేదని నక్కా ఆరోపించారు. తన సొంత బాబాయిని చంపిన వారు జైలుకు వెళ్లకుండా సీఎం జగన్ రక్షిస్తున్నారని ఆనంద్​ బాబు ఆరోపించారు. జగన్ నిర్లక్ష్యం వల్లే నీటి విషయంలో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందని, కృష్ణా, తుంగభద్ర జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. జగన్​ను నమ్ముకొని జైలుకు వెళ్లిన మోపిదేవి వేంకటరమణకు టిక్కెట్ లేదని, జగన్ కోసం రాజధానికి అన్యాయం చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి టిక్కెట్ ఇవ్వలేదని ఇలా నమ్మిన ప్రతి ఒక్కరినీ జగన్​ మోసం చేశాడని ఆరోపించారు. గతంలో జగన్​ను నమ్మి అక్రమాలకు పాల్పడ్డ ఐఏఎస్​లు జైలుకు వెళ్లారని, భవిష్యత్​లో ఐఏఎస్, ఐపీఎస్​లు కూడా జైలుకు పోయే పరిస్థితులు నెలకొంటాయని హెచ్చరించారు.

'విశ్వసనీయత అంటే మాదీ నాదీ' అంటూనే నయవంచన- ఇదే జగ'నైజం'

సొంత చెల్లి, తల్లితో ఆడుకున్నాడన్నారు: అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ అందరితో అడుకుంటున్నాడని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఎద్దేవా చేశారు. చివరికి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆడుకుంటున్నారని విమర్శించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో బండారు మీడియాతో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్మికులతో, భవన కార్మికులతో, మందు బాబులతో సీఎం జగన్ ఆడుకున్నాడనారు. సొంత చెల్లి, తల్లి తో ఆడుకున్నాడని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో అడుకుంటున్నాడని ఆరోపించారు. టిడ్కో ఇళ్ల లబ్ది దారులతో జగన్ అడ్డుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలతో కూడా ఈ జగన్ ఆటలు ఆడుకుంటున్నారని. తాజాగా, ఈరోజు ఆడుకుందాం ఆంధ్రా అని పిలుస్తున్నారని విమర్శించారు. రేపు ప్రభుత్వం రాగానే, మద్యం, ల్యాండ్, సాండ్, లో వైసీపీ ప్రభుత్వం అవినీతిని ఆధారాలతో నిరూపించి జగన్​ను జైలు​కు పంపడం ఖాయమన్నారు. ఒక పక్క కరోనా వస్తోందని ఏరకమైన చర్యలు తీసుకోకుండా ఇంట్లో కూర్చుని పబ్జీగేమ్​లు అడుకోమని బండారు ఎద్దేవా చేశారు.

'వైసీపీ గద్దె దిగేవరకు పోరాడతాం' - మోపిదేవికి మద్దతుగా మత్స్యకార సంఘాల సమావేశం

ABOUT THE AUTHOR

...view details