ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల ఇంటి కలను వైకాపా సర్కారు దూరం చేసింది: నాదెండ్ల మనోహర్ - Janasena Latest Updates

Nadendla Manohar: జగనన్న కాలనీల్లో వైకాపా నాయకులు అవినీతికి పాల్పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శల వర్షం గుప్పించారు. వైకాపా నేతలు జగనన్న ఇళ్ల పథకంలో ఆక్రమాలకు పాల్పడ్డారని.. దీనివల్ల పేదలు తమ సొంతింటి కలకు దూరం అయ్యారని అయన ఆరోపించారు.

Nadendla Manohar
నాదెండ్ల మనోహర్

By

Published : Nov 15, 2022, 10:55 PM IST

Janasena Nadendla Manohar: జగనన్న ఇళ్ల పథకంలో వైకాపా నాయకులే కమీషన్ ఏజెంట్లుగా మారారని జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గత మూడు రోజులుగా జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన 'జగనన్న ఇళ్లు- పేదలందరికీ కన్నీళ్లు’ కార్యక్రమంలో ఈ విషయం వెల్లడైందని ఆయన తెలిపారు. ఇళ్ల పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇళ్ల పేరుతో భారీ అవినీతి తంతు జరిగిందని అన్నారు. వైకాపా సర్కారు పేదల ఇంటి కలను దూరం చేసిందని విమర్శించారు. మంత్రులు చవకబారు ఎత్తుగడలు మాని.. క్షేత్రస్థాయికి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయని హితవు పలికారు. జగనన్న కాలనీ స్థలాలు చెరువుల్లా మారాయని అన్నారు. అరకొర నిర్మాణాలు చేపట్టినా అవీ నాసిరకంగా ఉన్నాయని చెప్పారు.

జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

"వైకాపా నాయకులు కమీషన్​ ఏజెంట్లుగా మారి..రూ. 6 నుంచి 10 లక్షల విలువైన భూములను కొని.. వాటిని ప్రభుత్వానికి సుమారు 30 లక్షల రూపాయలకు ఇచ్చారు. ఒక్క చోటనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. 17 వేల కాలనీల్లో ఇంకా ఎన్ని ఆక్రమాలు జరిగి ఉంటాయి. ప్రభుత్వం ఈ 17 వేల ఎకరాల్లో ఎంత మొత్తానికి భూమిని కొనుగోలు చేసింది. అక్కడే ఎందుకు కొనుగోలు చేసింది. ఆ వివరాలు బయటకు వెల్లడించాలి." -నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ ఛైర్మన్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details