ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోడల్​ హార్బర్​గా మారనున్న నిజాంపట్నం

రాష్ట్రంలో మత్స్యకారుల వలసలు నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కొత్త జెట్టీలు, ఫిష్ ల్యాండింగ్లులతో గుంటూరు జిల్లాలోని నిజాంపట్నంను మోడల్​​ హార్బర్​గా మార్చనుంది. హార్బర్ అభివృద్ధికి 450 కోట్ల రూపాయల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పంపినట్లు నాబార్డ్ ప్రతినిధులు తెలిపారు.

nabard  representatives visit nizaampatnam harbor
నిజాంపట్నం హార్బర్​ను సందర్శించిన నాబార్డ్ ప్రతినిధులు

By

Published : Dec 30, 2020, 7:11 PM IST

Updated : Dec 30, 2020, 7:41 PM IST

రాష్ట్రంలో మత్స్యకారుల వలసలను నివారించి వారికి మరింత ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త జెట్టీలు, ఫిష్ ల్యాండింగ్లు నిర్మించేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నాబార్డ్ సంస్థ ప్రతినిధులు గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్​ను సందర్శించారు. జిల్లా మత్స్య శాఖ అధికారులతో కలిసి నాబార్డ్ జనరల్ మేనేజర్ ప్రకాష్ దాస్, అసిస్టెంట్ మేనేజర్ సంజయ్, రాష్ట్ర రీజియన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.రామలక్ష్మి తదితరులు జెట్టిని పరిశీలించారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు ,మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

450 కోట్లతో ప్రతిపాదన...

హార్బర్ అభివృద్ధికి ప్రభుత్వం 450 కోట్ల రూపాయలతో ప్రతిపాదనను పంపించిదని నాబార్డ్ ప్రతినిధులు తెలిపారు. అందులో 150 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుండగా, మిగిలినవి నాబార్డ్ నిడా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెంట్ నుంచి ఇవ్వనున్నట్లు వివరించారు. ఏపీ మ్యారి టైం బోర్డ్ ద్వారా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాలు జరుగుతాయన్నారు. రెండు సంవత్సరాలలో నిర్మాణాలు అన్ని పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 60 బోట్ల సామర్థ్యం ఉన్న జెట్టిని 250 బోట్లు నిలిపేలా నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్, రెస్ట్ రూమ్స్, బొట్ల మరమ్మత్తులు, హైజినిక్ పద్దతిలో లోడింగ్ ,అన్ లోడింగ్... వంటి నిర్మాణాలు జరుగనున్నాయని అన్నారు.

మోడలింగ్ హార్బర్​గా నిజాంపట్నం

ఎప్పటి నుంచో ఉన్న ఇసుక మేట సమస్యను పూర్తిగా పరిష్కరించనున్నట్లు నాబార్డ్ ప్రతినిధులు వివరించారు. ఈ అభివృద్ధి పనులు వలన మత్స్యకారుల జీవనోపాధి పెరగడంతోపాటు .. ఒక మోడల్​ హార్బర్​గా నిజాంపట్నం నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిలా మత్స్యశాఖ జేడీ రాఘవరెడ్డి, నిజాంపట్నం ఎఫ్​డీవో కౌసర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

నరసరావుపేటలో కలెక్టర్​ పర్యటన

Last Updated : Dec 30, 2020, 7:41 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details