అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ...గుంటూరు జిల్లా వినుకొండలో ముస్లిం పెద్దలు, అన్ని పార్టీల ముస్లిం నాయకులు ర్యాలీ నిర్వహించారు. వారిని ఆత్మహత్యకు ప్రేరేపించిన పోలీసులను శాశ్వతంగా తొలగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వినుకొండ ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.
'సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి' - గుంటూరులో ముస్లిం పెద్దల ర్యాలీ
సలాం కుటుంబం ఆత్మహత్యకు నిరసనగా గుంటూరు జిల్లా వినుకొండలో ముస్లిం పెద్దలు, అన్ని పార్టీల ముస్లిం నాయకులు ర్యాలీ నిర్వహించారు. వారి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
'సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి'