ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ధర్నా... - నెల్లూరులో ముస్లింల ధర్నా

పౌరసత్వ బిల్లు కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు ధర్నాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం భాజపా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

muslims protest about  cab bill
పౌరసత్వ బిల్లు కు వ్యతిరేకంగా ముస్లింల ధర్నా...

By

Published : Dec 21, 2019, 10:17 AM IST

పౌరసత్వ బిల్లు కు వ్యతిరేకంగా ముస్లింల ధర్నా...


గుంటూరు జిల్లా
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నరసరావుపేట పట్టణంలో ముస్లిం సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు .కేంద్ర ప్రభుత్వం భాజాపా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమానికి వివిధ ముస్లిం సంఘాలు నాయకులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా
సీఏఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కర్నూలులో ముస్లింలు ధర్నా చేశారు. పాత నగరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగరంలో ర్యాలీ సందర్భంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
నెల్లూరు జిల్లా
పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద మసీదు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆవాజ్ కమిటీ సభ్యులు, ముస్లింలు, వామపక్ష నాయకులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.
కడప జిల్లా
కడప జిల్లా కమలాపురం పట్టణంలో ఎన్ఆర్‌సీ, క్యాబ్ పౌరసత్వ బిల్లు వెంటనే రద్దు చేయాలని ముస్లింలు ఆందోళన చేశారు. కమలాపురం దర్గా పీఠాధిపతి మౌలానా సాహెబ్ ప్రారంభించారు .హిందూ ముస్లిం భాయి భాయి... అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో నరసింహులకు వినతిపత్రం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details