ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయినవాళ్లు మొహం చాటేశారు.. పరాయివారే తోడుగా నిలిచారు..! - మంగళగిరిలో హిందూ మృతదేహానికి ముస్లింల అంత్యక్రియలు

కరోనా కాలంలో సాధారణ సమస్యలతో చనిపోయిన వారి మృతదేహాల దగ్గరికి కూడా.. బంధువులు పోవడం లేదు. వారిని అనాథ శవాల్లానే వదిలేస్తున్నారు. ఇలాంంటి ఓ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో జరగింది. చివరికి ఇస్లామిక్ సేవా కమిటీ మానవత్వం చాటి.. ఆ మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది.

 Muslims conducted cremation to Hindu  dead body at Mangalagiri
మంగళగిరిలో హిందూ మృతదేహానికి ముస్లింల అంత్యక్రియలు

By

Published : May 12, 2021, 5:21 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇస్లామిక్ సేవా కమిటి మానవత్వం చాటింది. మంగళగిరి టిప్పర్ల బజార్​కు చెందిన వాసా వాసు (50) అనే వ్యక్తి మంగళవారం అర్థరాత్రి సాధారణ అనారోగ్యంతో మృతి చెందారు.

కరోనాతో మరణించినట్లు భావించిన బంధువులు, సన్నిహితులు అంత్యక్రియలకు ముందుకు రాలేదు. స్థానికులు ఇస్లామిక్ సేవా కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. కమిటీ సభ్యులు వెళ్లి.. వాసు మృతదేహాన్ని హిందూ శ్మశాన వాటికకు తరలించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేయించారు.

ABOUT THE AUTHOR

...view details