ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు - గుంటూరు ప్రధాన రహదారిపై మైనారిటీల ఆందోళన - మైనారిటీ వర్గీయుల రాస్తారోకో తాజా వార్తలు

కర్నూలు - గుంటూరు ప్రధాన రహదారిపై... మైనారిటీలు రాస్తారోకో నిర్విహించారు. జిల్లాలోని జొన్నలగడ్డ పంచాయితీ పరిధిలోని ఓ కాలనీలో ఉన్న ప్రార్ధనా స్థలం వెనుక... మరో వర్గానికి చెందిన వ్యక్తులు పందిని కోశారని స్థానిక ముస్లింలు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. ఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు.

muslim minority helds rastaroko at kurnool guntur highway
కర్నూల్-గుంటూరు ప్రధాన రహదారిపై మైనారిటీ వర్గీయుల రాస్తారోకో

By

Published : Dec 6, 2020, 4:11 PM IST

కర్నూలు - గుంటూరు ప్రధాన రహదారిపై మైనారిటీ వర్గీయులు రాస్తారోకో చేపట్టారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ పంచాయితీ పరిధిలోని ఓ కాలనీలో ఉన్న ప్రార్ధనా స్థలం వెనుక... మరో వర్గానికి చెందిన వ్యక్తులు పందిని కోశారని... స్థానిక ముస్లింలు ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. కర్నూలు - గుంటూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా చేరుకుని ఆందోళనకారుల రాస్తారోకోను విరమింపచేశారు. అనంతరం నిలిచిపోయిన ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు.

మసీదు నిర్మాణానికి అనుమతి

కొన్నిరోజుల క్రితం జొన్నలగడ్డ పరిధిలోని కాలనీలో మసీదు నిర్మాణానికి... స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూమిపూజ చేశారు. అప్పటినుంచి ముస్లింలు ఆ స్థలంలో ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే... ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడారు. మరోవర్గం వారు తమకు ప్రార్ధనా స్థలంలో కొంత స్థలం ఉందని ఎమ్మెల్యేకు వివరించారు. ప్రార్ధనా స్థలానికి కేటాయించిన స్థలం పూర్తిగా తమకు ఉండాలని ముస్లింలు ఎమ్మెల్యేను కోరారు. ఇరు వర్గీయులతో ఎమ్మెల్యే చర్చించి... మసీదు నిర్మించ తలపెట్టిన స్థలంలో మరో వర్గానికి రెండు అడుగులు స్థలాన్ని ఇచ్చి మిగిలిన స్థలంలో మసీదు నిర్మాణం చేసుకునేలా సర్దిచెప్పగా... గొడవ సద్దుమణిగింది.

దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు

ఎవరైనా మత విద్వేష చర్యలకు పాల్పడితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లుగా ఎమ్మెల్యే వివరించారు.

ఇదీ చదవండి:

'ఏయూ ఐపీఆర్‌ చైర్'​​గా డాక్టర్‌ హనుమంతు పురుషోత్తం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details