ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలు: సోదరుడి చేతిలో వ్యక్తి హతం - undefined

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. అన్న అని కూడా చూడకుండా.. తమ్ముడు హతమార్చాడు. కుటుంబ వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

murder in gunturu district
murder in gunturu district

By

Published : Oct 15, 2020, 3:28 AM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో దారుణం జరిగింది. వరుసకు సోదరుడు అయ్యే తిరుమలశెట్టి నాగరాజును... మహేష్ అనే వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంత కాలం నుంచి నాగరాజుకు అతని కుటుంబసభ్యులకు మధ్య వివాదం ఉన్నట్టు గుర్తించారు.

కొలకలూరు సెంటర్లో నాగరాజుపై మహేష్ కత్తితో దాడి చేసి విచక్షణ రహితంగా గాయపరిచాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని స్థానికులు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దారిలోనే నాగరాజు మృతి చెందాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details