మదనపల్లెలో మూఢ విశ్వాసంతో కన్న కుమార్తెలను కడతేర్చిన పురుషోత్తం, పద్మజలను.. విశాఖ మానసిక వైద్యశాల నుంచి మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. సాయుధ పోలీసు రక్షణతో ప్రత్యేక వాహనంలో నిందితులను.. వైద్యశాల అధికారులు తీసుకొచ్చారు. మదనపల్లె సబ్‌జైలు అధికారులకు అప్పజెప్పారు.
విశాఖ నుంచి మదనపల్లెకు జంట హత్య కేసు నిందితులు - విశాఖ నుంచి మదనపల్లెకు జంట హత్య కేసు నిందితులు తరలింపు వార్తలు
దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన మదనపల్లె జంట హత్య కేసు నిందితులను.. విశాఖ నుంచి మదనపల్లెకు తరలించారు. ఉన్నత చదువులు చదివి.. మూఢ నమ్మకాలతో.. కన్న బిడ్డలనే కడతేర్చిన పురుషోత్తం, పద్మజలను సాయుధ పోలీసు రక్షణతో తీసుకొచ్చి.. మదనపల్లె సబ్‌జైలు అధికారులకు అప్పగించారు.
![విశాఖ నుంచి మదనపల్లెకు జంట హత్య కేసు నిందితులు murder case Accused shifted to Madanapalle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11201290-969-11201290-1617007580389.jpg)
మదనపల్లెకు జంట హత్య కేసు నిందితులు తరలింపు
ఉన్నత చదువులు చదవి.. మూఢ విశ్వాసంతో కన్న బిడ్డలను అతి కిరాతంగా.. చంపిన కేసులో పురుషోత్తం, పద్మజలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి మానసిక పరిస్థితి సరిగా లేక ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొన్న అధికారులు.. నిందితులకు విశాఖలోని మానసిక వైద్య శాలలో చికిత్సను అందించారు. అనంతరం వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.
ఇవీ చూడండి...:రంగుల పండుగను ఆనందంగా జరుపుకొన్న చిన్నారులు