ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఐదుగురు ముఠా సభ్యులను గుంటూరు లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 2కిలోల గంజాయి, 5 వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు తూర్పు డీఎస్పీ సుప్రజ తెలిపిన వివరాల ప్రకారం...నగరంలో నివాసం ఉండే బసవల వాసు అనే వ్యక్తిని సంవత్సరం క్రితం కొందరు దుండగులు హత్య చేశారు. వాసును కడతేర్చిన వ్యక్తిని హత్య చేయాలని ఆయన వద్ద పని చేసిన ముఠా ప్లాన్ చేసింది. కుక్కల శివ అనే రౌడీషీటర్‌ను కలసి హత్యకు కుట్ర చేస్తున్న సమయంలో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు.
హత్య చేద్దామనుకున్నారు...అడ్డంగా దొరికిపోయారు..! - 5గురు హత్య ముఠాను అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు
ఓ వ్యక్తిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. కానీ విషయం పోలీసులకు తెలియటంతో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయిన ఐదుగురు ముఠా