గుంటూరులోని లాలాపేట పరిధిలో నగల వ్యాపారిపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఓ బంగారం వ్యాపారితో సహా మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆధిపత్యం కోసమే..

ఇద్దరు వ్యాపారుల మధ్య నెలకొన్న ఆధిపత్యం, పాత కక్షల నేపథ్యంలోనే హత్యాయత్నం జరిగిందని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ప్రధాన నిందితుడు మున్నాపై ఇదివరకే క్రిమినల్ కేసులున్నాయని వివరించారు. బెయిల్పై బయటకు వచ్చాడని అన్నారు. అతని బెయిల్ రద్దుకు చర్యలు చేపడతామని చెప్పారు. నగరపాలక సంస్థ ఎన్నికలు నోటిఫికేషన్ దృష్ట్యా నగరంలోని రౌడీషీటర్లు, నేర చరిత్ర ఉన్న వారిపై నిఘా పెంచామని ఎస్పీ అమ్మిరెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 135 రోజుల్లో 6వేల కిలోమీటర్లు.. దేశాన్ని చుట్టిరావడమే లక్ష్యం