ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడి హత్య... అక్రమ సంబంధమే కారణమని అనుమానం - chilakaluripeta

గుంటూరు జిల్లాలో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చికెన్​ షాపు నిర్వహించే వ్యక్తిని​ దారుణంగా చంపారు. అక్రమ సంబంధమే ఘటనకు కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో యువకుని హత్య

By

Published : Jul 24, 2019, 12:14 PM IST

గుంటూరు జిల్లాలో యువకుని హత్య

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చి స్థిరపడ్డ షేక్ ఖాదర్(30) చికెన్ షాపు, చికెన్ పకోడి బండి నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే రాత్రి గదిలో పడుకున్న ఖాదర్​.. ఉదయానికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఖాదర్​ ఒంటిపై కత్తితో గాట్లు ఉన్నాయి. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. హత్యకు అక్రమ సంబంధమే కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details