అగ్రిగోల్డ్ కస్టమర్ల ఎజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పోరాటం వల్లే రూ.265 కోట్ల సాధనకు కారణమైందని... సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అగ్రిగోల్డ్ అసోషియేషన్ చారిత్రాత్మక పోరాటాల నేపథ్యంలోనే బాధితుల ఖాతాలలో నగదు పడబోతున్నాయని వివరించారు. ప్రజలను మోసం చేసే ఇలాంటి కంపెనీలను ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున రూ.1150 కోట్లు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చిందన్నారు.
'అగ్రిగోల్డ్ బాధితులకు నగదు... మా పోరాట ఫలితమే' - muppalla nageswara rao comments on agrigold
తొలి విడతగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ... తీసుకున్న నిర్ణయంపై సీపీఐ నేత కృతజ్ఞతలు తెలిపారు. తమ పోరాటల ఫలితంగానే బాధితులకు న్యాయం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఈనెల 26న చేపట్టబోయే ఆందోళనలు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు ముప్పాళ్ల నాగేశ్వరరావు.
ముఖ్యమంత్రి మాటలపై నమ్మకంతో ఇప్పటి వరకు ఆందోళన చేపట్టలేదని ముప్పాళ్ల తెలిపారు. రూ.265కోట్లు ఇస్తూ పరిపాలనా పరమైన ఆమోదముద్ర వేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నగదు విడుదలతో 26తేదీన కలెక్టర్ కార్యాలయాల వద్ద చేయనున్న ఆందోళనలు రద్దు చేసినట్టు ప్రకటించారు. అగ్రిగోల్డ్ చేసే కుట్రలకు ప్రభుత్వం అవకాశం కల్పించొద్దని కోరారు. ఆస్తుల వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే నవంబర్ 18,19 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద 36గంటల దీక్ష చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ... బలిమెల జలాశయం నీళ్లు... మీకెంత... మాకెంత..!
TAGGED:
అగ్రిగోల్డ్ బాధితులు