ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో ముప్పాళ్ల సోదరుడు మృతి - సీపీఐ తాజా సమాచారం

కరోనాతో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు సోదరుడు ముప్పాళ్ల రమేశ్ మృతి చెందారు. రమేష్ కుటుంబానికి సీపీఐ నాయకులు సంతాపం తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఆయన భార్య కూడా కరోనాతో మరణించింది.

died
కరోనాతో మృతి

By

Published : Jun 14, 2021, 10:01 AM IST

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు నాలుగో సోదరుడు ముప్పాళ్ల రమేశ్‌ (55) కొవిడ్‌తో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు సీపీఐ జిల్లా కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రమేశ్‌ సతీమణి పుష్పరాణి 36 రోజుల కిందట కొవిడ్‌తో మరణించారు.

కొద్ది రోజుల క్రితం ఆయనకూ కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూ ఆయన కూడా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ముప్పాళ్ల రమేశ్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారి మృతి పట్ల సీపీఐ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details