Munugode By poll Polling : తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 298 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. నియోజకవర్గవ్యాప్తంగా 2 లక్షల 41 వేల 855 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 47 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపా అభ్యర్థిగా బరిలో దిగారు. గతంలో గెలుపొంది 2018లో ఓటమి పాలైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరోమారు తెరాస తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి ఎన్నికల పోరులో నిలిచారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా శంకరాచారి, 10 మంది ఇతర పార్టీల అభ్యర్థులు, 33 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు.
Munugode By poll Polling: కొనసాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ - Munugode By poll Polling
Munugode By poll Polling : గత నెల రోజులుగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 47 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నేడు తేల్చనున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్