నిత్యవసర సరుకులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపల్ కమిషనర్ విజయ సారథి హెచ్చరించారు. ఏ దుకాణదారుడైన ధరలు పెంచినట్లయితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కరోన మహమ్మరిని తరిమికొట్టేందుకు ప్రజలందరూ సహకరించడం ఆనందదాయకమని అన్నారు. పట్టణంలో ఎలాంటి రోగాలు ప్రబలకుండా ఉండేందుకు..అధికారులు క్రిమి నాశన రసాయనాలను స్ప్రే చేయించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ.. స్వీయ నిర్బంధంలో ఉండాలని కమిషనర్ కోరారు. ఇంటి వద్దనే ఉండి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకునేలా పట్టణ ప్రజలకు రెండు రోజుల్లో ప్రత్యేక యాప్ను విడుదల చేస్తామని తెలిపారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే కఠిన చర్యలు
ఏ దుకాణదారుడైనా ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. నిత్యావసర సరుకుల కొనుగోలుకు రెండు రోజుల్లో ప్రత్యేక యాప్ అందుబాటులోకి వస్తుందన్నారు.
munsipal