మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం.. మంత్రి బొత్స సత్యనారాయణను కలసి వినతిపత్రం అందజేశామన్నారు. దానిపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. కార్మికుల సమస్యలు ఈనెల 20లోపల పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటివరకు ఇంజినీరింగ్ కార్మికులను పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 13 ప్రకారం.. దానిని సవరించి వేతనాలు పెంచి ఇవ్వాలని మునిసిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్-టౌన్ ప్లానింగ్ యూనియన్ అధ్యక్షుడు ఈదులముడి మధుబాబు డిమాండ్ చేశారు.
ఈ నెల 21న మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా - గుంటూరు తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని.. మునిసిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ యూనియన్ అధ్యక్షుడు ఈదులముడి మధుబాబు తెలిపారు. ఏపీ మున్సిపల్ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా.. ఈనెల 21న గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామన్నారు.
'మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'
ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులకు.. ప్రభుత్వ పథకాలు వర్తింపు చేయవని చెప్పడం దారుణమన్నారు. తక్షణమే అమ్మఒడితో సహా అన్ని పధకాలు వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ రాష్ట్రవ్యాప్త ఆందోళనల పిలుపులో భాగంగా.. ఈనెల 21న గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామన్నారు. అప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరం కాకపోతే ఉద్యమం బాట పడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: