ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీతాలు చెల్లించాలంటూ మున్సిపల్ కార్మికుల నిరసన - గుంటూరులో మున్సిపల్ కార్మికుల నిరసన

మున్సిపల్ కార్మికులకు 7 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని గుంటూరు జిల్లాలో కార్మికులు ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లాలోని ఎర్రబాలెం సీఆర్డీఏ కార్యాలయం వద్ద... మోకాళ్ల మీద కూర్చొని నిరసన చేపట్టారు.

municipal workers protest in guntur to give their salaries
జీతాలు చెల్లించాలంటూ మున్సిపల్ కార్మికుల నిరసన

By

Published : Nov 6, 2020, 4:45 PM IST

జీతాలు చెల్లించాలంటూ రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లాలోని ఎర్రబాలెం సీఆర్డీఏ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, సీపీఎం నేతలు మోకాళ్లు మీద కూర్చొని నిరసన చేపట్టారు.

ఏడున్నర నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే జీతాలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details