మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు.. ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ యంత్రాంగం చర్యలు చేపట్టింది. అన్ని వార్డులు, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను ఒకేసారి తెరచి కౌంటింగ్ ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. గతంలో కన్నా ఓట్ల లెక్కింపు కేంద్రాల సంఖ్యను పెంచిన అధికారులు.. అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించారు. రెండు, మూడు గంటల్లోనే ఫలితాలు వెలువడతాయని అధికారులు స్పష్టం చేశారు. అన్ని ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ నియమావళికి అనుగుణంగానే జగుతున్నాయని వెల్లడించారు.
గుంటూరులో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి - ఎన్నికల వార్తలుట
రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలను వేగంగా అందించేందుకు వీలుగా.. కౌంటిగ్ కేంద్రాలను అధికారులు గుంటూరులో ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
గుంటూరులో కౌంటింగ్ ఏర్పాట్లు