కొవిడ్ విధులకు కేటాయించబడిన అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని గుంటూరు నగర పాలక కమిషనర్ చల్లా అనురాధ అన్నారు. కొవిడ్ విధులకు కేటాయించబడిన అధికారులతో కమిషనర్ ప్రత్యేకంగా సమావేశం జరిపారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. దీనికోసం నగర పాలక సంస్థ ప్రత్యేకంగా అధికారులకు విధులు కేటాయించడం జరిగిందన్నారు.
'అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి' - officers assigned to covid duties latest news update
కొవిడ్ విధులు కేటాయించిన అధికారులు ప్రతి రోజు కొవిడ్ సెంటర్లలో ఇన్స్పెక్షన్ నిర్వహిస్తూ ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులను నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు గుంటూరు నగర పాలక కమిషనర్ చల్లా అనురాధ ఆదేశించారు. కొవిడ్ విధులకు కేటాయించబడిన అధికారులతో కమిషనర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
!['అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి' Municipal Commissioner meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8161845-829-8161845-1595615560060.jpg)
కొవిడ్ విధులు కేటాయించిన అధికారులతో మున్సిపల్ కమిషనర్