Sp Balasubrahmanyam Statue: గుంటూరు నగరంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు వివాదానికి దారితీసింది. నగరంలోని మదర్ థెరిస్సా కూడలి వద్ద కళాదర్భార్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదని నగరపాలక సంస్థ అధికారులు ఈ రోజు తొలగించారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు.. విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మెను కూల్చివేసి విగ్రహాన్ని అక్కడినుంచి తరలించారు.
ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు.. గుంటూరు కార్పొరేషన్ అధికారుల అత్యుత్సాహం - sp balu statue news
Sp Balasubrahmanyam: గుంటూరులో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశాారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవని నగరపాలక సంస్థ అధికారులు విగ్రహాన్ని తొలగించారు. విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మెను కూల్చివేసి విగ్రహాన్ని అక్కడినుంచి తరలించారు.
ఆదివారం ఏర్పాటు చేసిన విగ్రహం మరుసటి రోజే తొలగించటంపై కళాదర్బార్ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు స్పందించారు. బాలసుబ్రహ్మణ్యం వంటి మహా గాయకుడికి కార్పొరేషన్ అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. బాలు విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రెండేళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా అనుమతివ్వలేదని వాపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి విగ్రహం గుంటూరులో ఏర్పాటు చేస్తే.. అధికారులు ఇలా వ్యవహరించటం సరికాదన్నారు. నగరంలో అనుమతి లేని విగ్రహాలు ఎన్నో ఉన్నాయని.. వాటిని కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. తొలగించిన స్థానంలోనే బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
ఇవీ చదవండి: