గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. కరోనా విజృంభిస్తున్న ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ ఆరోపించారు. పలుమార్లు డిఎంఏ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన - గుంటూరు తాజా వార్తలు
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ..గుంటూరు పురపాలక కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు.
![గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9522527-1095-9522527-1605174389138.jpg)
గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన
కరోనా పోరులో ప్రాణాలు విడిచిన కార్మికులకు 50 లక్షల పరిహారం చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు బాధితులకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ఈ సందర్భంగా జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే తమ పార్టీ ఆధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇదీచదవండి