ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్కారీ... స్టూడెంట్స్ నెంబర్ 1 - govt schools

సర్కారీ బడి తీరు మారుతోంది. కార్పొరేట్ స్కూళ్లకు ప్రభుత్వ పాఠశాలలు సవాల్ విసురుతున్నాయి. ప్రైవేట్​ పాఠశాలలకు దీటుగా ఫలితాలు ఉంటున్నాయి. ప్రభుత్వ చొరవ, ఉపాధ్యాయుల కృషితో ఉత్తీర్ణత శాతంతోపాటు ర్యాంకులు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాయి.

సర్కారీ...స్టూడెంట్స్ నెంబర్..1

By

Published : May 15, 2019, 7:26 AM IST

పదో తరగతి ఫలితాల్లో పురపాలక పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. 90.36 శాతం ఉత్తీర్ణతతో కార్పొరేట్ పాఠశాలలకు సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా 403 పురపాలక పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 10/10 జీపీఏ పాయింట్లు సాధించి ఔరా అనిపించారు. పురపాలక పాఠశాలల్లో నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్సు, ప్రత్యేక తరగతుల ఫలితంగా ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి.
10కి పది జీపీఏ

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది పురపాలక పాఠశాలల్లో 25 వేల 294 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. వీరిలో 22 వేల 771మంది అంటే 90.36శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 48 పాఠశాలల్లో 100 శాతం పాసయ్యారు. గతంతో పోలిస్తే 10/10 జీపీఏ పాయింట్లు సాధించిన వారి సంఖ్య పెరిగింది. 2016లో 11మంది, 2017లో 49మంది, 2018లో 302మంది విద్యార్థులు పది పాయింట్లు సాధించగా...ఈ ఏడాది ఆ సంఖ్య 403కు చేరింది.
ఫౌండేషన్ కోర్సుతోనే...

రాష్ట్రంలోని అన్ని పురపాలక పాఠశాలల్లో నాలుగేళ్లుగా ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తున్నారు. 17 స్కూళ్లలో అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్సు ప్రవేశపెట్టి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పాఠశాలలన్నింటిలోనూ వందశాతం ఉత్తీర్ణతతోపాటు 26 శాతం మంది పదికి పది పాయింట్లు సాధించటం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 4వేల 851మంది విద్యార్థులు 9కి పైగా జీపీఏ పాయింట్లు సాధించారు.

అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను గుంటూరులోని పురపాలకశాఖ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. ఉన్నతాధికారులు వారందరినీ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల చొరవ, ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే తమ పిల్లలకు మంచి మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు చెబుతున్నారు.

అందుకే నో అడ్మిషన్స్..
ఫౌండేషన్ కోర్సు ఏర్పాటులో పురపాలకశాఖ మంత్రి నారాయణ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అధికారులతోపాటు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించారు. ఫలితంగానే ఈ ఏడాది కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు అధికారులు.

సర్కారీ...స్టూడెంట్స్ నెంబర్..1

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details