పుర ఎన్నికల నిర్వహణకు గుంటూరు జిల్లా రేపల్లెలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ బాక్స్‌లను సంబంధిత అధికారులకు అందించారు. పట్టణంలో మొత్తం 28 వార్డులు ఉండగా...నాలుగు వార్డులను వైకాపా ఏకగ్రీవం చేసుకుంది. వైకాపా 24, తేదేపా 23, జనసేన 4, భాజపా 3 ఇతరులు 15 స్థానాల్లో పోటీలో ఉన్నారు. రేపల్లెలో 36 వేల806 మంది ఓటర్లు ఉన్నారు. అన్ని కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు, మొబైల్ స్ట్రైకింగ్ ఫోర్స్, బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.
పురపాలక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లా రేపల్లెలో బుధవారం జరిగే పురపాలక ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పురపాలక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి