గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీటి గురించి ఉన్నతాధికారులను వివరణ కోరగా విచారిస్తామని చెప్పి ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదిరోజులుగా ఈ తంతు జరగుతున్న చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. త్వరితగతిన ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
'అక్రమ తవ్వకాలకు అడ్టుకట్ట వేయండి' - guntur
అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నా..అధికారులు పట్టించుకోవటం లేదంటూ గుంటూరు జిల్లా పిన్నెల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

'అక్రమ తవ్వకాలకు అడ్టుకట్ట వేయండి'