గుంటూరు జిల్లాలోని పొన్నూరు విద్యుత్ భవన్‌ను ఎమ్మార్పీఎస్ నాయకులు ముట్టడించారు. డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు రూరల్ మండలం ఓబుల్నాయుడుపాలెంలోని చర్మకారులకు విద్యుత్ మీటర్లను.. తక్షణమే విడుదల చేయాలని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పరిశపోగు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాల నుంచి చర్మకారులు అక్కడ నివాసం ఉంటున్నా.. అధికారులు వారికి మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. కలెక్టర్ విద్యుత్ మీటర్లు విడుదల చేసినా... విద్యుత్శాఖ సిబ్బంది తమకు మీటర్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నివాసం ఉంటున్న కాలనీలో తక్షణమే విద్యుత్ మీటర్లను పంపిణీ చేయాలని, లేకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
విద్యుత్ మీటర్లు పంపిణీ చేయాలని ఆందోళన - పొన్నారు ప్రధాన విద్యుత్ కార్యాలయం
గుంటూరు జిల్లా పొన్నూరులో విద్యుత్ మీటర్ల కోసం ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. తక్షణమే విద్యుత్ మీటర్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
mrps leaders protests APSPDCL at ponnaru guntur district