ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపల్లె సినిమా థియేటర్లలో ఎమ్మార్వో తనిఖీలు - గుంటూరు జిల్లా తాజా వార్తలు

గుంటూరు జిల్లా రేపల్లెలోని సినిమా థియేటర్లపై ఎమ్మార్వో విజయశ్రీ దాడులు చేశారు. పార్కింగ్ ఫీజులు, అధిక ధరలతో తినుబండారాలు అమ్ముతున్నారన్న ఫిర్యాదులతో.. ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

mro inspected on cinema theaters
రేపల్లెలో సినిమా థియేటర్లలో ఎమ్మార్వో తనిఖీలు

By

Published : Mar 4, 2021, 12:20 PM IST

రేపల్లెలోని సినిమా థియేటర్లపై ఎమ్మార్వో విజయశ్రీ దాడులు చేపట్టారు. యాజమాన్యాలు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందటంతో.. దాడులు చేసిట్లు ఎమ్మార్వో తెలిపారు. పార్కింగ్ ఫీజులు, తినుబండారాలపై అధిక రేట్లు తీసుకుంటున్నట్లు నిర్ధరణ అయ్యిందన్నారు. కొవిడ్​ నిబంధనలు పాటించటం లేదని వెల్లడించారు.

యాజమాన్యం చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ అధికారులపై నిందలు వేస్తున్నారని వివరించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టలర్​లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం సినిమా థియేటర్ల యాజమాన్యంపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details